ఆర్‌.పేట పోలీస్‌స్టేషన్‌కు రెండు అవార్డులు

ABN , First Publish Date - 2021-12-31T06:21:11+05:30 IST

విధి నిర్వహణలో ఆర్‌పేట సీఐ భీమరాజుకు ఈ ఏడాది రెండు అవార్డులు దక్కాయి.

ఆర్‌.పేట పోలీస్‌స్టేషన్‌కు రెండు అవార్డులు

   సీఐ భీమరాజుకు ఎస్పీ అభినందన

మచిలీపట్నం టౌన్‌ :   విధి నిర్వహణలో ఆర్‌పేట సీఐ భీమరాజుకు ఈ ఏడాది రెండు అవార్డులు దక్కాయి. వేలిముద్రలు సేకరించి నేరస్తులను కనుగొనడంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, జిల్లాలో ఆర్‌పేట పోలీసు స్టేషన్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇం దుకు ఆర్‌పేట సీఐ భీమరాజు అవార్డు అందుకున్నారు.  పోలీసు స్టేషన్‌లోని రికార్డులను కంప్యూటరీకరించడంలో జిల్లా అగ్రస్థానంలో ఉండగా, జిల్లాలో ఆర్‌పేట పోలీసు స్టేషన్‌ అగ్రస్థానంలో నిలిచింది. దీనికి మరో అవార్డును ఆర్‌పేట సీఐ భీమరాజు, ఎస్సై అనూష అందుకున్నారు. ఈ సందర్భంగా సీఐ భీమరాజును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - 2021-12-31T06:21:11+05:30 IST