మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-10-21T06:27:32+05:30 IST

మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన ఉండాలి

మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన ఉండాలి

 ఉంగుటూరు, అక్టోబరు 20 : మహిళలను ఎక్కువ ఇబ్బందికి గురిచేసే రొమ్ము కేన్సర్‌ (బ్రెస్ట్‌ కేన్సర్‌)వ్యాధి పట్ల ప్రతి మహిళ అప్రమత్తంగా వుంటూ అవగాహన కలిగి ఉండాలని అమెరికన్‌ అంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (విజయవాడ) ప్రముఖ కేన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ పాటిబండ్ల అనీల అన్నారు. రొమ్ము కేన్సర్‌ అవగాహనా మాసం సందర్భంగా ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ వి.శ్రీహరిబాబు ఆధ్వర్యంలో తేలప్రోలు ఉషారామా కళాశాలలో విద్యార్థినులకు బుధవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్‌ అనీల మాట్లాడుతూ శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం, జంక్‌ఫుడ్స్‌ తీసుకోవటం లాంటి కారణాలు రొమ్యు కేన ్సర్‌ వ్యాఽధి బారినపడేందుకు అవకాశాలు పెంచుతున్నాయన్నారు. మహిళలు ప్రతినెలా సెల్ఫ్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ టెక్నిక్స్‌ పాటించాలని, తద్వారా ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, సరైన వైద్యం పొందవచ్చునని తెలిపారు. కళాశాల యాజమాన్యం, విద్యార్థినులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:27:32+05:30 IST