రహదారి నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-12-30T06:23:34+05:30 IST

రహదారి నిబంధనలు పాటించాలి

రహదారి నిబంధనలు పాటించాలి
వాహనాలను నిర్లక్ష్యంగా నడిపిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ సత్యనారాయణ

పెనమలూరు, డిసెంబరు 29 : వాహనదా రులు రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటిం చాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం పోరంకి, తాడిగడప సెంటర్‌లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అతి వేగంగా, రాంగ్‌ రూట్‌లో వాహనాలను నడిపే 70 మందిని  గుర్తించి జరిమా నాలు విధించారు. 20 వాహనాలను సీజ్‌ చేశారు. వాహనదారులకు సీఐ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 

రామవరప్పాడు రింగ్‌లో.. 

 గుణదల: ద్విచక్రవాహనాలు నడిపేవారు నిబంధనలు పాటించకుంటే ఇకమీదట వాహనాలు సీజ్‌ చేస్తామని పటమట సీఐ రావి సురేష్‌ రెడ్డి తెలిపారు. రామవరప్పాడు రింగ్‌రోడ్డులో  బుధవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు.  రాంగ్‌రూట్లో అతివేగం గా వస్తున్న వాహనచోదకులను నిలువరించి జరిమా నాలు విధించటంతో పాటు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన ఆరు వాహనా లను  సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనాలు నిర్లక్ష్యంగా, అతివేగంగా నడపడటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయ కులు బలైపోతున్నారని దీనిని సహించేదిలేదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడప టం నేరమని, అలాంటి వ్యక్తుల లైసెన్స్‌ రద్దు తో పాటు వాహనాలను సీజ్‌ చేస్తామని సురేష్‌ రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-12-30T06:23:34+05:30 IST