రహదారి భద్రత నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-11-09T06:28:59+05:30 IST

రహదారి భద్రత నిబంధనలు పాటించాలి

రహదారి భద్రత నిబంధనలు పాటించాలి
రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్న రమణారావు,

 మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణారావు

ఉంగుటూరు, నవంబరు 8: రోడ్డు ప్రమాదాల బారినపడకుండా వుండాలంటే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణారావు అన్నారు. మండల పరిధిలోని తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం ఆధ్వర్యంలో సోమవారం రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రమణారావు మాట్లాడుతూ, ప్రమాదం అనేది చెప్పిరాదని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనాన్ని అప్రమత్తంగా నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో మనమందరం సమన్వయంతో కలిసి ప్రయాణం చేయాలన్నారు.. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తులను రక్షించుకోవడంలో అందరూ బాధ్యతగా మెలగాల న్నారు. రోడ్డుపై ప్రమాదం జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, క్షతగాత్రుల పట్ల మానవతాదృక్పధంతో స్పందించాలని తెలిపారు.  ఈ సందర్భంగా సీట్‌బెల్ట్‌, హెల్మెట్‌ధరించడం, ట్రిపుల్‌రైడింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, అధిక వేగంతో వాహనాలను నడపడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్ధులందరూ తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగివుండాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, రహదారి భద్రత ట్రైనర్‌ ఎం.వాసు, ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ వి.శ్రీహరిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T06:28:59+05:30 IST