ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-12-31T06:01:58+05:30 IST

గన్నవరం ఎయిర్‌పోర్టు ప్రధానద్వారం వద్ద జ రిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందగా మరో డ్రైవర్‌కు తీవ్రగాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది.

ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

డ్రైవర్‌ మృతి, మరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గన్నవరం, డిసెంబరు 30 : గన్నవరం ఎయిర్‌పోర్టు ప్రధానద్వారం వద్ద జ రిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి చెందగా మరో డ్రైవర్‌కు తీవ్రగాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పలాస ఆర్టీసీ డిపోకు అద్దె ప్రాతిపాదికన నడుపుతున్న సూపర్‌ లగ్జరీ బస్సు బుధవారం రాత్రి నగరానికి బయలుదేరింది. ఎయిర్‌పోర్టుకు వద్దకు రాగానే జాతీయ రహదారిపై స్పీడు బ్రేకర్ల వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందర్లపాడు మండలం ముప్పాళ్లకు చెందిన డ్రైవర్‌ నల్లాని యేల్లేశ్వరరావు (42) అక్కడికక్కడే మృతి చెందగా వెనుక సీటులో ఉన్న మైలవరానికి చెందిన డ్రైవర్‌ రమేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకుని బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన యేల్లేశ్వరరావు మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్సై రమే్‌షబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-12-31T06:01:58+05:30 IST