కళలు సమాజాభివృద్ధికి దోహదపడాలి

ABN , First Publish Date - 2021-12-30T06:44:29+05:30 IST

కళలు సమాజాభివృద్ధికి దోహదపడాలి

కళలు సమాజాభివృద్ధికి దోహదపడాలి

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీకాంతం

విజయవాడ సిటీ, డిసెంబరు 29 : ప్రముఖ సాంస్కృతిక, సామాజిక సంస్థ ‘అర్పిత’ 20వ వార్షికోత్సవం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి లక్ష్మీకాంతం మాట్లాడుతూ కళలు సమజాభివృద్ధికి దోహదపడాలన్నారు. అర్పిత సంస్థ నిర్వాహకులను ఆయన అభినందించారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాతత్వ గుణం అలవరచు కోవాలన్నారు. పలు రంగాల్లో ప్రతిభ కలిగిన 25 మందికి అవార్డులను ప్రదానం చేశారు. 47వ డివిజన్‌ కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి, అర్పిత సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T06:44:29+05:30 IST