రిజిస్ట్రేషన్లపై రైతులకు అవగాహన

ABN , First Publish Date - 2021-08-27T05:49:35+05:30 IST

రిజిస్ట్రేషన్లపై రైతులకు అవగాహన

రిజిస్ట్రేషన్లపై రైతులకు అవగాహన
ఉయ్యూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు కృష్ణారెడ్డి

ఉయ్యూరు, ఆగస్టు 26: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డాక్యుమెంట్‌ రైటర్ల చేతిలో మోసపోకుండా కార్యాలయాల్లో డాక్యుమెంట్లు పరిశీలించి రైతులకు రిజిస్ట్రేషన్లపై అవగాహన కలిగిస్తున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి తెలిపారు.  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లను గురువారం ఆయన పరిశీలించారు. పొలాల క్రయ వ్రికయాల  డాక్యుమెంట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారితో ఫోన్‌లో మాట్లాడారు. ఓ వ్యక్తి చెల్లించిన స్టాంపు డ్యూటీకి చెల్లించిన మొత్తానికి రూ. 7వేలు తేడా ఉండడాన్ని గమనించారు. రిజిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్‌ రైటర్‌కు ఫోన్‌ చేయగా..ఆయన నుంచి స్పందన రాలేదు. కార్యాలయానికి నేరుగా వచ్చి ఇతరుల ప్రమేయం లేకుండా రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని ఆయన సూచించారు. కంకిపాడు కార్యాలయంలోనూ రిజిస్ట్రేషన్‌ ఫీజుకు చెల్లించిన మొత్తానికి తేడాను గమనించామన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా ప్రభుత్వానికి ఎంత చెల్లించారో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి లిఖిత పూర్వకంగా తెలియపరచాలని సబ్‌ రిజిస్ట్రార్‌ టి.ప్రసాదరెడ్డికి సూచించారు.


Updated Date - 2021-08-27T05:49:35+05:30 IST