రెడ్‌క్రాస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా శ్రీధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-14T06:13:56+05:30 IST

రెడ్‌క్రాస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా శ్రీధర్‌రెడ్డి

రెడ్‌క్రాస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా శ్రీధర్‌రెడ్డి

విజయవాడ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్రశాఖ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.శ్రీధర్‌రెడ్డి ఆ సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ నేషనల్‌ హెడ్‌క్వార్టర్స్‌ (న్యూఢిల్లీ)లో మంగళవారం ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు పాల్గొనగా, శ్రీధర్‌రెడ్డి అత్యధికంగా 18 ఓట్లు సాధించి నేషనల్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన 12 మంది సభ్యుల్లో అత్యధిక ఓట్లు పొందిన శ్రీధర్‌రెడ్డిని ఆయా రాష్ట్రాల రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అభినందించారు. 

Updated Date - 2021-10-14T06:13:56+05:30 IST