ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-11-09T06:30:38+05:30 IST

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ సమస్యలు పరిష్కరించాలి

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ సమస్యలు పరిష్కరించాలి
ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వంశీ

గన్నవరం, నవంబరు 8: ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికారులను ఆదేశించారు. ఎయిర్‌పోర్టు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు చిన అవుటపల్లి పరిధిలో అన్ని వసతులు కల్పించి ఇంటి నిర్మా ణాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.  ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌కి సంబంధించిన మ్యాప్‌ను సోమవారం తన కార్యాలయంలో పరిశీలించారు. 

డిప్యూటీ తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, మండల సర్వేయర్‌ విజయవర్మ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ మ్యాప్‌ వివరాలను తెలియజేశారు. ప్యాకేజ్‌లో ఏమైన ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వంశీ సూచించారు. 

Updated Date - 2021-11-09T06:30:38+05:30 IST