వంతెన.. ప్రమాదానికి అంచున..

ABN , First Publish Date - 2021-03-24T05:32:34+05:30 IST

వంతెన.. ప్రమాదానికి అంచున..

వంతెన.. ప్రమాదానికి అంచున..

అవి నగరానికి కీలకమైన రామవరప్పాడు ఫ్లై ఓవర్లు. హైదరాబాద్‌, విశాఖపట్నం జాతీయ రహదారులను కలిపే ప్రధాన మార్గాలు. నిత్యం వందల సంఖ్యలో లారీలు, కార్లు, ఇతరత్రా వాహనాలు తిరిగే ఈ రెండు ఫ్లై ఓవర్లు ఇప్పుడు ప్రమాదభరితంగా మారాయి. రెయిలింగ్‌ దెబ్బతిని వంతెన అంచుల్లో పెద్దపెద్ద గోతులు పడినా పట్టించుకునే వారు లేరు. ఇది జరిగి చాన్నాళ్లు అవుతున్నా అడ్డుగా ట్రాఫిక్‌ ఇండికేటర్‌ పెట్టారు గానీ, కనీస మరమ్మతులు చేయలేదు. తాజాగా వంతెనపై పలుచోట్ల భారీ గోతులు పడ్డాయి. వాహనాల చక్రాలు అందులో ఇరుక్కుపోయి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులెవరూ పట్టించుకోవట్లేదు. ఫుట్‌పాత్‌ దెబ్బతిని నడవడానికి వీల్లేని స్థితిలో ఉంది. అక్కడక్కడ ఏర్పాటుచేసిన పూలకుండీల్లోని మొక్కలు ఎండిపోయి, కుండీలు ధ్వంసమైనా వాటిని తొలగించేవారు లేరు. అర్ధరాత్రి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీస్‌ గస్తీ శూన్యం. సీఆర్‌డీఏ రద్దు తర్వాత ఫ్లై ఓవర్లవైపు కన్నెత్తి చూసే వారు లేకపోవడంతో ఇలా అధ్వానంగా మారాయి. ఇకనైనా అధికారులు స్పందించి ఫ్లై ఓవర్లకు మరమ్మతులు నిర్వహించాలని, లేకుంటే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు వేడుకుంటున్నారు.  - విజయవాడ, ఆంధ్రజ్యోతి









Updated Date - 2021-03-24T05:32:34+05:30 IST