రావిరాలలో ఆదర్శ ‘పుష్కరం’

ABN , First Publish Date - 2021-02-06T06:45:36+05:30 IST

జిల్లాలోని పాలేరు, కృష్ణా నది సంగమ స్థానం రావిరాల గ్రామంలో 12 ఏళ్లుగా స్వచ్ఛంద సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది.

రావిరాలలో ఆదర్శ ‘పుష్కరం’

జగ్గయ్యపేట, ఫిబ్రవరి 5 : జిల్లాలోని పాలేరు, కృష్ణా నది సంగమ స్థానం రావిరాల గ్రామంలో 12 ఏళ్లుగా స్వచ్ఛంద సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది. వెయ్యిలోపు జనాభా ఉన్న ఈ గ్రామంలో అందరికీ జీవనాధారం కృష్ణమ్మలో చేపల వేట. బలుసుపాడు గురుదామ్‌ వ్యవస్థాపకుడు, తాత్వికుడు గెంటేల వెంకట రమణకు అమ్ముమ్మగారి ఊరు ఇది. ఆయన చేతుల మీదగా గ్రామంలోని ప్రసన్నాంజనేయ దేవస్థానంలో పుష్కర కాలం క్రితం హనుమత్‌ దీక్షలను గ్రామస్థులు ధరించారు.  మద్యం జోలికి వెళ్లబోమని ఆనాడు చేసిన ప్రతిజ్ఞను ఇప్పటికీ ఆచరిస్తూ ప్రతి ఏటా దేవస్థానం వద్ద హనుమత్‌ దీక్షలు చేస్తారు. ఎన్నికల సమయంలోనూ ఇదే పద్ధతిని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.  


Updated Date - 2021-02-06T06:45:36+05:30 IST