బృందావన కాలనీలో రమ క్లాత్ స్టోర్స్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-22T05:18:27+05:30 IST
బృందావన కాలనీలో రమ క్లాత్ స్టోర్స్ ప్రారంభం

పాయకాపురం, నవంబరు 21 : నగరంలోని బృందావన కాలనీలో ఉన్న నందమూరి రోడ్డులో ‘రమ క్లాత్ స్టోర్స్’ నూతన బ్రాంచ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ నూతన క్లాత్ స్టోర్స్‌ను డాక్టర్ యార్లగడ్డ సీతారత్నం, డాక్టర్ పోందుగుల విజయ.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత ఎంకే రాంప్రసాద్ మాట్లాడుతూ ‘ఏ ఫర్ ఎవ్రీ ఉమెన్’ అనే కాన్సెప్ట్‌తో ఈ ప్రత్యేక శారీ స్టోర్‌ను ప్రారంభించామన్నారు. వివిధ రంగాల్లోని మహిళలందరికీ నచ్చేలా అతిగొప్ప, అత్యంత తక్కువ ధరల్లో చీరలు అందించాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. నూతన క్లాత్ స్టోర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 21, 22, 23 తేదీల్లో ప్రతి కొనుగోలుపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. మహిళలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.