స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన ర్యాలీ
ABN , First Publish Date - 2021-01-20T06:32:20+05:30 IST
స్వచ్ఛ సర్వేక్షణ్‌పై అవగాహన ర్యాలీ

వన్‌టౌన్: స్వచ్చ సర్వేక్షణ్ - 2021లో నగరం ఉత్తమ ర్యాంక్ సాధించేలా ప్రజలు సహకరిం చాలని నగర పాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.గీతబాయి కోరారు. చిట్టినగర్ సర్కిల్-1 పరిధిలోని డివిజన్ల నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో స్వచ్చ సర్వేక్షణ్ అవగాహన ర్యాలీ కొత్తపేటలోని కేబీఎన్ కళాశాల వరకు నిర్వహిం చారు. 20 మీటర్ల జాతీయ జెండా పట్టుకొని స్వచ్చభారత్ ప్రత్ఞిజ్ఞ చేశారు. డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ రామకోటేశ్వరరావు, డాక్టర్ బాబు శ్రీనివాసన్, శానిటరీ సూపర్ వైజర్లు, కేబీఎన్ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
చిట్టినగర్: స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముత్యాలంపాడు రావిచెట్టు సెంటర్ నుంచి జీఎస్‌రాజు రోడ్డు, ఏఎస్‌రాజు రోడ్డు, దేవాలయంవీధి, వానపాలవారి వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్-2 డాక్టర్ రామకోటేశ్వరరావు, సర్కిల్-2 శానిటరీ సూపర్‌వైజర్ నవకిషోర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ జయరాజు పాల్గొన్నారు.