తొమ్మిది మంది టీచర్ల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-02-01T06:36:06+05:30 IST

బదిలీల్లో స్పౌజ్‌ను దుర్వినియోగం చేసినందుకు తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్‌ చేస్తూ డీఈవో ఎం.వి.రాజ్యలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

తొమ్మిది మంది టీచర్ల సస్పెన్షన్‌

మచిలీపట్నం టౌన్‌, జనవరి 31 : బదిలీల్లో స్పౌజ్‌ను దుర్వినియోగం చేసినందుకు తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్‌ చేస్తూ డీఈవో ఎం.వి.రాజ్యలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. భర్తకు దగ్గరలో భార్య బదిలీ అయ్యే విధంగా, భార్యకు దగ్గరలో భర్త బదిలీ అయ్యే విధంగా నిబంధనలకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ఇవ్వడంతో తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో కే. బేబీశాలిని, సిహెచ్‌. రత్నమాధురి, జి. రమణి, కె. కృష్ణవేణి, పి. రవిబాబు, కె. శివ అంకమ్మ, ఎం. జ్యోతిర్మయి, జి.వి. నాగలక్ష్మి, డి. లావణ్య ఉన్నారు. ఉపాధ్యాయుల ఆప్షన్లపై ఎంఈవోలు, డివైఈవోలతో విచారణ నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-02-01T06:36:06+05:30 IST