రహదారి అభివృద్ధి పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-19T06:06:00+05:30 IST

రహదారి అభివృద్ధి పనులు ప్రారంభం

రహదారి అభివృద్ధి పనులు ప్రారంభం
రహదారి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎంపీపీ నగేష్‌, సర్పంచ్‌ భీమయ్య, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ప్రభుకాంత్‌

 హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెం బరు 18 : వ్యవసాయ ఉత్పత్తుల రవా ణాకు,  తిప్పనగుంట శివారు మురళీ పురం నుంచి కానుమోలు వరకూ గల రహదారి అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. తిప్పనగుంట పంచా యతీ పరిథిలోని మురళీపురం వద్ద ఎంపీపీ యరగొర్లనగేష్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు మూల్పూరు ప్రభు కాంత్‌తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభిం చారు. రహదారి అధ్వానంగా తయారై రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందు లను ప్రభుకాంత్‌, ఎంపీటీసీ సభ్యురాలు కొవ్వలి పద్మ, సర్పంచ్‌ కలపాల భీమయ్య ఎమ్యెల్యే వంశీ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే రహదారిని అభివృద్ధి చేసేందుకు ఎంపీపీ నిధుల నుంచి 10 లక్షలు మంజూరు చేయించారు. మురళీపురం నుంచి కానుమోలు వద్ద ఎమ్‌ఎన్‌కే రహదారికి కలిసే వరకూ గల 4 కి.మీ రహదారి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రామస్తులకు, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించినట్లు  తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్‌, రవి, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T06:06:00+05:30 IST