రాధా-రంగా మిత్రమండలి నిరసన

ABN , First Publish Date - 2021-12-31T06:18:00+05:30 IST

వంగవీటి రాధాపై రెక్కీ జరిగి పది రోజులవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని రాధారంగా మిత్ర మండలి జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌ ధర్మారావు అన్నారు.

రాధా-రంగా మిత్రమండలి నిరసన

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 30 : వంగవీటి రాధాపై రెక్కీ జరిగి పది రోజులవుతున్నా  ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని రాధారంగా మిత్ర మండలి జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌ ధర్మారావు అన్నారు.  రేవతి సెంటరులో గురువారం వంగవీటి రంగా విగ్రహానికి నాయ కులు పూలమాలలు వేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు.  రాధారంగా మిత్రమండలి అధ్యక్షు డు ధర్మారావు మీడి యాతో మాట్లాడారు. రెక్కీ నిర్వహించిన వారిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారో ప్రజలకు చెప్పా లన్నారు.  కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యదర్శి కొట్టె వెంకట్రావు మాట్లాడుతూ, వంగవీటి రాధాకు  కాపు సంక్షేమ సేన అండగా ఉంటుంద న్నారు.  బ్రాహ్మణ సంఘం నాయకులు పివి ఫణికుమార్‌, రాధారంగా మిత్ర మండలి, కాపు సంక్షేమ సేన సభ్యులు మత్తి వెంకటేశ్వరరావు, వెన్నా నాగఫణి, పురం పాండురంగారావు, చలమలశెట్టి ఫణీంద్ర, పిన్ని రమేష్‌,కటకం ఆంజనేయులు, మట్టా దత్తుడు, త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-31T06:18:00+05:30 IST