ఫిబ్రవరిలో సీఎం జగన్ రచ్చబండ: మంత్రి కొడాలి నాని
ABN , First Publish Date - 2021-01-05T16:57:16+05:30 IST
వచ్చే ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
గుడ్లవల్లేరు(కృష్ణా): వచ్చే ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రచ్చ బండ నిర్వహించనున్నారని, రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లస్థలాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోం దని మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సోమవారం గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో నిర్వహించిన ఇళ్లపట్టాల పంపిణీలో మంత్రి నాని మాట్లాడారు. ఎన్నికల మానిఫోస్టోను మొదటి ఏడాదిలోనే 99 శాతం పూర్తి చేశామని టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు ప్రజలకిచ్చిన వాగ్దానాలను మొదటి మూడేళ్లు గాలికొదిలేసి చివరి ఆరునెల్లలో హడావుడి సృష్టించారన్నారు. తహసీల్దార్ ఆంజనేయులు, జిల్లా రైతు సలహామండలి సభ్యులు పెన్నేరు ప్రభాకరరావు, పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్ శేషం గోపి, వీఆర్‌ఓ భాస్కర్, కొండాలమ్మ దేవస్థాన చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, మండల పార్టీ కన్వీనర్ శాయిన రవికుమార్, అల్లూరి ఆంజనేయిలు, కోగంటి ధనుంజయ్ పాల్గొన్నారు.
ఫ గుడివాడలో క్లబ్ మూయించింది నేనే : మంత్రి కొడాలి నాని
స్వాతంత్రం వచ్చిన నాటినుంచి నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌లు మూయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిది, గుడివాడలో తానే మూయించి వేశానని మంత్రి కొడాలి నాని అన్నారు. దేవినేని ఉమా, టీడీపీ నేతలు పలువురు పేకాటలు ఆడేవారని మంత్రి ఆరోపించారు.