అతిగా పురుగు మందుల వాడకం అనర్థం

ABN , First Publish Date - 2021-12-30T06:25:16+05:30 IST

అతిగా పురుగు మందుల వాడకం అనర్థం

అతిగా పురుగు మందుల వాడకం అనర్థం
మినప పైరులో పురుగు , కలుపు మందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జయప్రద

శాయిపురం (ఉయ్యూరు), డిసెంబరు 29 : మినుము పంటలో ఇష్టానుసారంగా పురుగు మందులు వాడడం వృథాతో పాటు  ఖర్చు పెరు గుతుందని వ్యవసాయ శాఖ గన్నవరం సహాయ సంచాలకులు జెఎస్‌ జయప్ర ద అన్నారు. శాయిపురంలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన బుధ వారం పొలంబడి కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా రైతులతో కలసి ఆమె మినుముపైరును పరిశీ లించారు. అనంతరం రైతులను ద్ధేశించి మాట్లాడుతూ మినప పైరులో ప్రస్తు తం  కలుపు మందు మాత్రమే వాడే అవసరం ఉందని, ఎక్కడా  పురుగు ఆశించిన ధాఖలా లేదన్నారు.  ఈ పరిస్థితుల్లో అనవసరంగా పరుగు మందులు వాడవద్దని  సూచిం చారు. వరిపిలక, కలుపుజాతి మొక్కలు పొలా ల్లో కన్పిస్తున్నాయని వీటి నివారణకు సోడియం ఆసిప్లోరొఫెన్‌ 16.5 శాతం, క్లోడినాఫోప్‌ ప్రొపెర్గిల్‌ 8శాతం ఈసీని 200 మిల్లీలీటర్లు  ఎకరాకు  ఇమేజీత ఫైర్‌  10శాతం  ఎస్‌ఎల్‌తో  250 ఎం ఎల్‌తో కలిపి  చల్లుకోవాలని సూచిం చారు. 25 రోజుల తరువాత పైపులతో తడిపెట్టి కలుపు మందు చల్లుకుంటే కలుపు పూర్తిగా నివారించవచ్చన్నారు. కలుపు మందు తరువాత పురుగు కనపడితే వేపనూనె అవసరాన్ని బట్టి వాడుకోవాలని తెలియజేశారు.  ఏవో  శివప్రసాద్‌,  సర్పంచ్‌  జాన్‌బాషా  పలువురు రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-30T06:25:16+05:30 IST