ఆదర్శ నేత సుందరయ్య

ABN , First Publish Date - 2021-05-02T06:19:51+05:30 IST

ఆదర్శ నేత సుందరయ్య

ఆదర్శ నేత సుందరయ్య
పార్కులో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేస్తున్న సర్పంచ్‌ నిడమర్తి సౌజన్య

గన్నవరం, మే 1 : పీడిత ప్రజల ఆశాజ్యోతి, నేటి పాలకులకు ఆదర్శ నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య అని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ గన్నె వెంకట్రావు అన్నారు.  సుందరయ్య జయంతి సందర్భంగా స్థానిక పార్కులో ఆయన విగ్రహానికి సర్పంచ్‌ నిడమర్తి సౌజన్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో సుందరయ్య కీలక పాత్ర పోషించారన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీలకు సైకిల్‌పై వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, పిల్లి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఫ హనుమాన్‌ జంక్షన్‌ :   కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి వేడుకలను శనివారం బాపులపాడు మం డలంలో  కార్మిక సంఘాలు సీపీఎం శ్రేణులు నిర్వహించాయి. హను మాన్‌జంక్షన్‌లో  సీపీఎం కార్యాలయం వద్ద  మండల కార్యదర్శి బేత శ్రీనివాసరావు  జెండాను ఆవిష్కరించి  అమరవీరులకు నివాళుల ర్పించారు. సుందరయ్య చిత్రపటం వద్ద నివాళుర్పించారు.  

Updated Date - 2021-05-02T06:19:51+05:30 IST