పన్నుల పెంపు జీవోలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-07-12T05:55:54+05:30 IST

పన్నుల పెంపు జీవోలు రద్దు చేయాలి

పన్నుల పెంపు జీవోలు రద్దు చేయాలి
పన్నుల పెంపునకు వ్యతిరేకంగా రాణిగారితోటలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

రాణిగారితోట, జూలై 11: ఇంటి పన్నులు పెంచబోమని ఎన్నికల ముందు మాట ఇచ్చి గెలిచిన వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశంలో పెంచిన పన్ను జీవోలను రద్దు చేయించాలని టీడీపీ 18వ డివిజన్‌ అధ్యక్షుడు వేముల దుర్గారావు డిమాండ్‌ చేశారు. పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 18వ డివిజన్‌ రాణిగారితోటలో ఆదివారం టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. 196, 197, 198 జీవోలను రద్దు చేసి పాత పద్ధతిలోనే పన్నులు అమలు చేయాలని వారు కోరారు. 18వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన వెంకట సత్యనారాయణ ఫ్లోర్‌ లీడర్‌గా ఎన్నికయ్యారని, ఎన్నికల ముందు చెప్పినట్టుగా పన్నులు పెంచకుండా ఇచ్చిన జీవోలను రద్దు చేయించాలని, ఈనెల 15న కౌన్సిల్‌ సమావేశంలో డిమాండ్‌ చేయాలని కోరారు. రద్దు చేయించకపోతే ఆయనను నమ్మి గెలిపించిన ప్రజలను మోసం చేసినట్లేనని, వైసీపీ నేతలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హితవు చెప్పారు. డివిజన్‌ నాయకులు తలపాటి ప్రసాద్‌, రామారావు, రమణ, శ్రీను, నరసింహులు, కాశి, మరియమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-12T05:55:54+05:30 IST