ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-10-19T06:34:40+05:30 IST

ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలి

ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలి
పర్మినెంట్‌ చేయాలని కోరుతూ సీఎంకు పోస్టుకార్డులు పంపుతున్న వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

 వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పోస్టుకార్డుల ఉద్యమం

వన్‌టౌన్‌, అక్టోబరు 18: వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న తమను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరుతూ ఉద్యోగులు పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులయి రోస్టర్‌ విధానంలో కలెక్టర్‌ నియమించిన తాము ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, తమను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరుతూ సీఎంకు సోమవారం కొత్తపేట మలేరియా సబ్‌ యూనిట్‌-3లో పనిచేసే ఉద్యోగులు పోస్టుకార్డులు పంపించారు. జేఏసీ జిల్లా కన్వీనర్‌ మిరియాల వెంకట కిషోర్‌కుమార్‌, రవి, మురళీకృష్ణ, రత్నకుమార్‌, శివనారాయణ, సురేష్‌కుమార్‌, పీబీ శ్రీనివాస్‌, అనంద జయకర్‌, లీలా శ్రీనివాస్‌, రవికుమార్‌, పిచ్చేశ్వరరావు, శ్రీనివాసరావు, పిచ్చిరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T06:34:40+05:30 IST