పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-08-27T06:05:53+05:30 IST

ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ, ఉద్యాన, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సైంటిస్టు గిరిజారాణి తెలిపారు.

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 26 : ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ, ఉద్యాన, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సైంటిస్టు గిరిజారాణి తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశించేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులయి ఉండాలని, వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, పశుపోషణ, మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశించేందుకు అవకాశం ఉందన్నారు. 

Updated Date - 2021-08-27T06:05:53+05:30 IST