పేకాడుతున్న తొమ్మిది మంది అరెస్టు..రూ.27,750 స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-20T06:34:37+05:30 IST
పేకాడుతున్న తొమ్మిది మంది అరెస్టు..రూ.27,750 స్వాధీనం

వన్‌టౌన్, అక్టోబరు 19: కృష్ణలంక పచ్చమేడ బజారులోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) బృందం దాడి చేసింది. తొమ్మిది మందిని అరెస్టు చేసింది. వారి నుంచి రూ.27,750, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. గుంటూరుకు చెందిన కొండేటి మస్తాన్‌రావు, కొండేటి మల్లేశ్వరరావు, కృష్ణలంకకు చెందిన గట్లా లక్ష్మీనారాయణరెడ్డి, గుంటూరు కొత్తపేటకు చెందిన కట్టా నాగరాజు, కృష్ణలంకకు చెందిన నందం సురేష్ కుమార్, ఆవులమంద అచ్చయ్య, గోళ్ల అంకమ్మరావు, గోలి శరత్‌బాబు, మంగళగిరికి చెందిన మునగాల పడిగిరాజు అరెస్టయిన వారిలో ఉన్నారు.