మచిలీపట్నం డివిజన్ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడిగా మస్తాన్ వలి
ABN , First Publish Date - 2021-04-19T06:17:16+05:30 IST
మచిలీపట్నం డివిజన్ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడిగా మస్తాన్ వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మచిలీపట్నం టౌన్ : మచిలీపట్నం డివిజన్ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడిగా మస్తాన్ వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేడుక ఫంక్షన్ హాలులో ఆదివారం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సంఘ కార్యదర్శిగా వంకా అనంత కుమార్, కోశాధికారిగా బి.సత్యనారాయణ ఎన్నికయ్యారు. లహరి శంకర్, మోహనరావు, ఎన్. త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.