24 గంటల్లో 27 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-05T06:23:31+05:30 IST

24 గంటల్లో 27 పాజిటివ్‌ కేసులు

24 గంటల్లో 27 పాజిటివ్‌ కేసులు

 పెనమలూరు, మే 4 : మండలంలో గడచిన 24 గంటల్లో 27 పాజిటివ్‌ కేసు లు నమోదైనట్టు తహసీల్దార్‌   భద్రు ఒక ప్రకటలో తెలిపారు. దీంతో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన నాటి నుంచి ఈ నెల 3వ తేదీ వరకు 873 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తెలిపారు. వారిలో 14 మంది మృతి చెందగా 350 మంది కోలుకున్నారని, 509 మంది కోలుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం బుధవారం నుంచి మండలంలో పాక్షికంగా కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత వ్యాపారాలను నిర్వహించినా, రహదారులపై సంచరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు ఇంటి నుంచి బయటకు వచ్చే వారు మాస్కులు ధరించకుంటే జరిమానా విధిస్తామని తహసీల్దారు భద్రు పేర్కొన్నారు.

ఒకేరోజు 16 కేసులు 

ఉంగుటూరు  :  మండలంలో మంగళవారం ఒక్కరోజే 16 కరోనా కేసులు నమోదైనట్లు ఉంగుటూరు, ఇందుపల్లి పీహెచ్‌సీల వైద్యాధికారులు డాక్టర్‌ కె.వాణి, డాక్టర్‌ వి.సుబ్బారావు తెలిపారు. తేలప్రోలులో ఆరుగురు, మానికొండలో ముగ్గురు, వెల్దిపాడులో ఇద్దరు, ముక్కపాడు, నాగవరప్పాడు, వేమండ, వెన్నూతల, ఉంగుటూరుల్లో  ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. కాగా పెదఅవుటపల్లి పీహెచ్‌సీ పరిధిలో గన్నవరం మండలంలోని గొల్లనపల్లి, చిక్కవరం గ్రామాల్లో మరో రెండు కేసులు నమోదైనట్లు వైద్యాధికారిణి బి,శిరీష తెలిపారు. కరోనా బారినపడిన వారిలో అధికశాతం మంది 13 నుంచి 50ఏళ్ల లోపువారే ఉన్నారని వైద్యాధికారులు పేర్కొన్నారు. చాపకింద నీరులా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్‌ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని,  ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితు ల్లోనూ మాస్క్‌ లేకుండా బయటకు రాకూడదని సూచించారు. స్వీయ సంర క్షణ చర్యల ద్వారానే కరోనాని కట్టడి చేయగలమని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.  

Updated Date - 2021-05-05T06:23:31+05:30 IST