పాలనపై స్వపక్షం అసంతృప్తి, ఆగ్రహం
ABN , First Publish Date - 2021-12-31T06:16:08+05:30 IST
స్వపక్ష సభ్యులే విపక్ష సభ్యులుగా మారి మునిసిపల్ పాలనపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నల వర్షం కురిపించి అధికారు లను ఉక్కిరిబిక్కిరి చేశారు. పెడన మునిసిపల్ సమావేశం గురువారం గరంగరంగా జరిగింది.

పెడన కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై నిలదీత
పెడన, డిసెంబరు 30 : స్వపక్ష సభ్యులే విపక్ష సభ్యులుగా మారి మునిసిపల్ పాలనపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నల వర్షం కురిపించి అధికారు లను ఉక్కిరిబిక్కిరి చేశారు. పెడన మునిసిపల్ సమావేశం గురువారం గరంగరంగా జరిగింది. సమావేశంలో 17వ వార్డు కౌన్సిలర్ మెట్ల గోపీప్రసాద్ మా ట్లాడుతూ, చైర్‌పర్సన్ కౌన్సిలర్లను కలుపుకు పోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వార్డుల్లో పర్యటించేటప్పుడు సంబంధిత కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఈ ఆరోపణలను చైర్‌పర్సన్ బళ్ళ జ్యోత్స్న రాణి ఖండించారు. తాను కౌన్సిలర్లతో కలసే వార్డుల్లో పర్యటిస్తున్నానన్నారు. తన పర్య టన గురించి ముందస్తుగానే కౌన్సిలర్లకు తెలియచేస్తున్నానన్నారు. కౌన్సిలర్లు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఎప్పటి కప్పుడు ఆదేశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. చెప్పిన పనులు జరిగాయా? లేదా? అన్న విషయమై పర్యవేక్షణ ఉండాలని ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్ సూచించారు. పాత కూరగా యల మార్కెట్ రోడ్డులో ఆక్రమణలు తొలగిం చకపోవడంపై గోపీప్రసాద్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డును సర్వే చేయిస్తున్నామని, సర్వే పూర్తి కాగానే ఆక్ర మణలు తొలగిస్తామని టీపీవో ఏసుబాబు హామీ ఇచ్చారు. ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ, సచివాలయ శానిటరీ సెక్రట రీల వ్యవస్థ వచ్చాక పట్టణంలో పారిశుధ్య పరిస్థితి దిగజారిందన్నారు. 7, 8 వార్డుల్లోకి వారానికి ఒకసారి కూడా ట్రాక్టర్లు రావడం లేదని ఆయన ఆరోపించారు. రద్దు చేసిన శానిటరీ మేస్ర్తీల వ్యవస్థను పునరుద్ధరించి పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరచాలని ఆయన సూచించారు. కమిషనర్ అంజయ్య మాట్లాడుతూ, ఉదయాన్నే వార్డు ల్లో తిరిగి పారిశుధ్య పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన శానిటరీ సెక్రటరీలు ఆ బాధ్యతను నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శానిటరీ సెక్రటరీల వల్ల ఉపయోగం లేనందున కౌన్సిల్ తీర్మానం ద్వారా కలెక్టర్ సరెండర్ చేయవచ్చన్నారు. తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గరికముక్కు చంద్రబాబు మాట్లాడుతూ, అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాం ట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 12, 21 వార్డుల కౌన్సిలర్లు మట్టా శివపావని, పిచ్చుక సతీష్ లు పలు సమస్యలను ప్రస్తావించారు. శానిటేషన్‌పై ఒక కమిటీని నియమించాలని చంద్రబాబు, కటకం ప్రసాద్ సూచించారు. వాహనాల ఆయిల్ విషయంలో అవకత వకలు జరుగుతున్నాయని వారు ఆరోపిం చారు. అజెండాలోని తొమ్మిది అంశాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.