చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధి నివారణకు పీసీవీ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-08-22T05:00:34+05:30 IST

చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధి నివారణకు పీసీవీ వ్యాక్సిన్‌

చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధి నివారణకు పీసీవీ వ్యాక్సిన్‌

జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌

పాయకాపురం, ఆగస్టు 21 : చిన్నారుల్లో శ్వాసకోశ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న న్యూమోకోకల్‌ కాంజుగేట్‌ (పీసీవీ) వ్యాక్సిన్‌పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ సూచించారు. పీసీవీ వ్యాక్సిన్‌పై శనివారం సంబంధిత అధికారులతో నగరంలోని ఆక్సిజన్‌ వార్‌ రూమ్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శివశంకర్‌ మాట్లాడుతూ చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధి బారిన పడకుండా న్యూమోకోకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు. ఈ వ్యాక్సిన్‌ను వచ్చే వారం నుంచి పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారిణి ఎం.సుహాసినీ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, డీఈవో తాహెరా సుల్తానా, ఐసీడీఎస్‌ పీడీ ఉమారాణి, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారిణి డాక్టర్‌ శర్మిష్టా, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, మున్సిపల్‌ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-22T05:00:34+05:30 IST