తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-02T06:16:20+05:30 IST

చెడు వ్యసనాలకు బానిసైన కుమారుడిని తల్లి మందలించటంతో ఆ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య

చల్లపల్లి, మే 1: చెడు వ్యసనాలకు బానిసైన కుమారుడిని తల్లి మందలించటంతో ఆ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చల్లపల్లిలోని పడమర వీధి దళితవాడలో శనివారం జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం..  దళితవాడ వద్ద నివసించే కుంభా మహాలక్ష్మయ్య కుమారుడు పవన్‌కుమార్‌(25) ఆటో నడుపుతుంటాడు. దురలవాట్లకు బానిసైన కొడుకు మద్యం తాగి ఇంటికి రావటంతో తల్లి మందలించింది. మనస్థాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హుటాహుటిన చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు చల్లపల్లి ఎస్సై పి.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్వో పి.శ్రీనివాసరావు శవపంచనామా నిర్వహించగా, మృతదేహాన్ని శవపరీక్షకు అవనిగడ్డ తరలించారు.


Updated Date - 2021-05-02T06:16:20+05:30 IST