పారిశుధ్యం అధ్వానం!

ABN , First Publish Date - 2021-07-12T06:18:08+05:30 IST

పారిశుధ్యం అధ్వానం!

పారిశుధ్యం అధ్వానం!
తేలప్రోలులో చెత్తనిల్వలు

 పేరుకుపోతున్న చెత్త నిల్వలు 

  పూడుకుపోయిన డ్రెయిన్లు 

  రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు 

 పట్టించుకోని అధికారులు 

  ఇబ్బంది పడుతున్న స్థానికులు 

ఉయ్యూరు/ ఉంగుటూరు, జూలై 11 :  పట్టణంలో పారిశుధ్యం నానాటికి తీసికట్టుగా తయారైంది. ఇంటింటా చెత్తసేకరణలో సిబ్బంది నిర్లక్ష్యం, పారిశుధ్య అధికారుల పర్యవేక్షణ కొరవ డడంతో పట్టణ రోడ్లలో పేరుకుపోయిన  చెత్తకుప్ప లు, పొంగిపొరలుతున్న మురుగు కాల్వలు దర్శన మిస్తున్నాయి. వార్డుల్లో  నగర పంచాయతీ  పారి శుధ్య సిబ్బందిచేత ఇంటింట చెత్త సేకరణ చేపట్టి నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమకు తెలియ దన్నట్టుగా వ్యవహరిస్తూ రోడ్లపైనే చెత్త పోస్తున్నప్పటికి వారికి అవగాహన కల్పించటంలో  అధికారులు విఫలమవుతున్నారు. దీనితో పారిశుధ్య సిబ్బంది వచ్చినప్పుడు చెత్తవేయ కుండా రోడ్లు, మురుగు కాల్వలో పోస్తున్నారు. దీనితో రోడ్లపైన చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఫోస్టాఫీసు రోడ్డులో ఓ ప్రార్ధనా మందిరం సమీపాన ఆ ప్రాంత ప్రజలు చెత్త డంప్‌ చేస్తున్నారు.  అనునిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో చెత్తకుళ్లి దుర్వాసన రావడంతో పాటు చెత్త డ్రెయిన్‌లోకి  వెళ్లి ప్రవాహానికి అడ్డు తగులుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సమస్య, అసౌకర్యాన్ని సాక్షాత్తు నగర పంచాయతీ కమిషనర్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోతున్నారు. 

తేలప్రోలులో..

ఉంగుటూరు మండలంలో మేజర్‌ పంచాయతీ గ్రామమైన తేలప్రోలుకు సరైన డంపింగ్‌ స్ధలం లేకపోవడంతో పారిశుధ్య సమస్య తలెత్తుతోంది. పలుచోట్ల చెత్తనిల్వలు పేరుకుపోతూ, డ్రెయినేజీలు పూడుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. ఏలూరుకాల్వ సమీపంలో రోడ్డు వెంబడి పేరుకుపోయిన చెత్తను  కొద్దిరోజులుగా పంచాయతీ సిబ్బంది తొలగించకపోవడంతో  ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెత్త కుళ్లిపోయి దాన్నుంచి వచ్చే దుర్వాసనకు  రోడ్డుపై నడిచే పాదచారులు, వాహనాలపై ప్రయాణించే వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి ఇలా వుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి, ఈవోపీఆర్డీ విజయకుమార్‌ని వివరణ అడుగగా ఏ. సీతారామపురంలో జాతీయరహదారి వెంట, తేలప్రోలు గ్రామంలోకి వచ్చే రహదారి వెంట దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు, తోపుడుబండ్లపై వ్యాపారాలు చేసేవారు చెత్తతీసుకొచ్చి ఇక్కడ పడవేస్తున్నారని, పంచాయతీ సిబ్బంది చెబుతున్నా పట్టించుకోవటంలేదని తెలిపారు. రెండు గ్రామాల వ్యాపారస్ధులు, తోపుడుబండ్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరిస్తామన్నారు. సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు.


 

Updated Date - 2021-07-12T06:18:08+05:30 IST