కనీస వేతనం కోసం పంచాయతీ కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2021-11-25T06:42:20+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ప్రమాద బీమా, కనీస వేతనం అమలు చేయాలంటూ కలెక్టరేట్‌ వద్ద బుధవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కనీస వేతనం కోసం పంచాయతీ కార్మికుల ధర్నా

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 24 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ప్రమాద బీమా, కనీస వేతనం అమలు చేయాలంటూ కలెక్టరేట్‌ వద్ద బుధవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. పోలినాయుడు ఈ ధర్నాకు నాయకత్వం వహించి మాట్లాడారు. కార్మికులు గ్రామాల పరిశుభ్రత కోసం, ప్రజల ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం అనితర సేవలందిస్తున్నారు. పంచా యతీ కార్మికులకు కనీస వేతనం రూ. 18 వేలు చెల్లించా లన్నారు. కార్మికులపై రాజకీయ వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ధర్నాలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకుడు శీలం నారాయణ రావు, సిహెచ్‌. జయరావు, కార్యదర్శి కె. శ్రీనివాసరావు, ఎం. జగన్‌, కె. బాపయ్య, ప్రభుశేఖర్‌, వి. కిరణ్‌, వై. రమేష్‌, శివపార్వతి, నాగలక్ష్మి  పాల్గొన్నారు.



Updated Date - 2021-11-25T06:42:20+05:30 IST