ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేయాలి

ABN , First Publish Date - 2021-03-21T05:53:47+05:30 IST

ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేయాలి

ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ నిలిపివేయాలి
ఉయ్యూరులో కరపత్రాలు పంచుతున్న ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు

ఉయ్యూరు, మార్చి 20: ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయాలని ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ మచిలీపట్నం డివిజన్‌ ఉయ్యూరు బ్రాంచ్‌ ఆధ్వర్యంలో శనివారం ఉయ్యూరులో కరపత్రాలు పంపిణీ చేశారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రభుత్వ వాటాలను అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలు విరమించుకోవాలని యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎల్‌ఐసీలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఇవ్వడానికి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు సహకారం అందించే సలహాదారులను నియమించడానికి టెండర్లు పిలవడం, ఎల్‌ఐసీలో వాటాల ఉపసంహరణకు సిద్ధమవడం ప్రజావ్యతిరేక చర్యగా యూనియన్‌ నాయకులు పీఎస్వీ మంగతాయారు, వీవీవీ అశోక్‌కుమార్‌, సీహెచ్‌ నాగేష్‌,  వీవీ వెంకటేశ్వరరావు,  నరసింహం అభివర్ణించారు. 


Updated Date - 2021-03-21T05:53:47+05:30 IST