చిత్రకళతో సమాజ వికాసం
ABN , First Publish Date - 2021-10-29T06:27:33+05:30 IST
చిత్రకళతో సమాజ వికాసం జరుగుతుందని పొట్టిశ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు (పీఎస్‌సీహెచ్‌ఎం) ఇంజనీరింగ్ కళాశాల కమిటీ అధ్యక్షుడు చలువాది మల్లిఖార్జున రావు అన్నారు.

చిత్రకళతో సమాజ వికాసం
పీఎస్‌సీహెచ్‌ఎం ఇంజనీరింగ్ కళాశాల కమిటీ అధ్యక్షుడు మల్లిఖార్జునరావు
వన్‌టౌన్, అక్టోబరు 28: చిత్రకళతో సమాజ వికాసం జరుగుతుందని పొట్టిశ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు (పీఎస్‌సీహెచ్‌ఎం) ఇంజనీరింగ్ కళాశాల కమిటీ అధ్యక్షుడు చలువాది మల్లిఖార్జున రావు అన్నారు. జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో కాకరపర్తి భావన్నారాయణ కళాశాల (కేబీఎన్)లో గురువారం చిత్రకళా ప్రదర్శన ఏర్పాటర ుుంది. ఈ ప్రదర్శనను కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ వి నారాయణరావుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక చిత్రం ఎన్నో భావాలను ప్రోది చేస్తుందన్నారు. భావ వ్యక్తీకరణను చిత్రంలో చొప్పించడంలో నేర్పు ఉండాలని, కళా పిపాసన ఉండాలని తెలిపారు. ఏడాది కాలంగా రైతులు తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న తీరును చిత్రకారులు తమ చిత్రకళ ద్వారా కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారన్నారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ, ఎయిడెడ్ కళాశాల రద్దు అంశాన్ని ప్రసావిస్తూ దానివల్ల కలిగే ఇబ్బందులను వివరించారు. సేవ్ విశాఖ స్టీల్ , రైతుల ఉద్యమం, తదితర చిత్రాలు విద్యార్థులను బాగా ఆకట్టుకు న్నాయి. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విజయబాబు, సాంస్కృతిక వేదిక సభ్యులు గుండు నారాయణరావు, ఐజాక్ న్యూటన్ తదితరులు పాల్గొన్నారు.