పాడిరైతు కుటుంబాలకు అండగా క్షీరబంధు
ABN , First Publish Date - 2021-10-28T06:21:28+05:30 IST
పాడిరైతు కుటుంబాలకు అండగా క్షీరబంధు

హనుమాన్‌జంక్షన్ రూరల్, అక్టోబరు 27 : ఆపద సమయంలో క్షీరబంధు పథకం ద్వారాపాడిరైతు కుటుంబాలకు కృష్ణామిల్క్ యూనియన్ అండగా నిలుస్తోందని పాల సొసైటీ అధ్యక్షుడు కన్నికంటి పట్టాభిరామ్ అన్నారు. హనుమాన్‌జంక్షన్ క్లస్టర్ పరిధిలోని ఎం.ఎన్.పాలెంలో ఇటీవల మరణించిన పాలసొసైటీ సభ్యుడు బోయపాటి వెంకట సుబ్బా రావు భార్య బేబీసరోజినికి క్షీరబంఽధు పథకం ద్వారా మంజూరైన రూ.50 వేల చెక్కును మేనేజర్ వి.వి.సం పత్‌కుమార్‌తో కలిసి ఆయన బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ ప్రసాద్, గోపాలరావు, శ్రీమన్నారాయణ, కార్యదర్శులు రాంబాబు, అజంత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.