6 పీఏసీఎస్‌లకు పెట్రోల్ బంకులు
ABN , First Publish Date - 2021-07-24T06:38:08+05:30 IST
జిల్లాలో ఆరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) పెట్రోలు బంకులు నిర్వహించేందుకు అనుమతులు ఇస్తున్నామని కేడీసీసీబ్యాంకు సీఈవో ఏ.శ్యామ్ మనోహర్ తెలిపారు.

మచిలీపట్నం టౌన్, జూలై 23 : జిల్లాలో ఆరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) పెట్రోలు బంకులు నిర్వహించేందుకు అనుమతులు ఇస్తున్నామని కేడీసీసీబ్యాంకు సీఈవో ఏ.శ్యామ్ మనోహర్ తెలిపారు. చల్లపల్లి మండలం పురిటిగడ్డ, ముదినేపల్లి మండలం వాడవల్లి, కోడూరు మండలం ఉల్లిపాలెం, గన్నవరం మండలం ఆముదాలపల్లి, గుడివాడ మండలం జనార్ధనపురం, చాట్రాయి మండలం పోలవరం, పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు పీఏసీఎస్‌లకు పెట్రోలు బంకులు మంజూరు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.65 లక్షలు అందిస్తామన్నారు.