ఆక్సిజన్‌ ప్లాంట్ల ప్రారంభోత్సవం నేడు

ABN , First Publish Date - 2021-10-07T06:38:26+05:30 IST

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పీఎం కేర్స్‌ కింద ఏర్పాటు చేసిన మూడు మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్‌ నివాస్‌ బుధవారం పరిశీలించారు.

ఆక్సిజన్‌ ప్లాంట్ల ప్రారంభోత్సవం నేడు
ఏర్పాట్లపై జీజీహెచ్‌ అధికారులతో మాట్లాడుత్ను నివాస్‌

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోది

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ నివాస్‌


పాయకాపురం, అక్టోబరు 6 : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో పీఎం కేర్స్‌ కింద ఏర్పాటు చేసిన మూడు మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్‌ నివాస్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్లాంట్లను గురువారం ఉదయం ప్రధాని నరేంద్రమోది వర్చువల్‌గా ప్రారంభిచనున్నారని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అశోక్‌సింఘాల్‌, కమిషనర్‌ కె.భాస్కర్‌, ఏపీఎస్‌ఎంఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, వర్చువల్‌ వేదిక ద్వారా హాజరవుతారని తెలిపారు. కరోనా రోగులకు ఆక్సిజన్‌ అవసరాలను తీర్చేందుకు అత్యాధునిక మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. కలెక్టర్‌ వెంట జేసీ శివశంకర్‌, సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, డీఎంహెచ్‌వో సుహాసిని ఉన్నారు.

Updated Date - 2021-10-07T06:38:26+05:30 IST