కానూరు ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద రద్దీ
ABN , First Publish Date - 2021-05-08T06:08:20+05:30 IST
కానూరు ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద రద్దీ

పెనమలూరు, మే 7: కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో కానూరులోని రెండు ఫిలింగ్ స్టేషన్ల వద్ద నిత్యం రద్దీ వాతావరణం నెలకొంది. పెనమలూరుతో పాటు విజయవాడ లోని ఆయా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఎప్ప టికపుడు ఆక్సిజన్‌ను అందించడానికి బాధితుల బంధువులు, స్నేహితులు నరకం చవిచూస్తున్నారు. రెండు ప్రైవేటు ఫిలింగ్ స్టేషన్ల వద్ద 45 టన్నుల ఆక్సిజన్‌ను విశాఖపట్నం నుంచి తెచ్చి నిత్యం అందుబాటులో ఉంచుతు న్నారు. నిత్యం రద్దీ ఏర్పడుతుండటంతో శుక్రవారం జేసీ శివశంకర్, ఏసీపీ శ్రీనివాసరెడ్డి పరిస్థితులను సమీక్షించారు. స్థానిక సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సిలిండర్ల కోసం వచ్చే వారి వాహ నాలను క్రమపద్ధతిలో పంపడానికి పోలీసు సిబ్బందిని నియమించారు. కార్యక్ర మంలో తహసీల్దారు భద్రు, సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు.