దివిసీమలో అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ సమస్యను పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-08-27T06:09:36+05:30 IST

దివిసీమలో అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కోరారు.

దివిసీమలో అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ సమస్యను పరిష్కరించండి
సమస్యను కలెక్టర్‌కు వివరిస్తున్న ఎమ్మెల్యే రమేష్‌బాబు

కలెక్టర్‌కు ఎమ్మెల్యే సింహాద్రి వినతి

కోడూరు, ఆగస్టు 26 : దివిసీమలో అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, దివి మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు కోరారు. కోడూరు మండల పర్యటనకు గురువారం విచ్చేసిన  కలెక్టర్‌ జె.నివాస్‌కు వివరించారు. దివిసీమలో సముద్ర ఆటుపోట్ల సమయంలో ఉప్పునీరు ఎగువకు తన్నకుండా భారీ వర్షాలు కురిసినప్పుడు పొలాల్లో మురుగు పోయేందుకు ఉపయోగపడే అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్‌, డ్రైనేజీ అధికారుల మధ్య సమన్వయలోపంతో ఆ పనులు ముందుకు సాగటం లేదని కలెక్టర్‌కు వివరించారు.  సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరగా, సమీక్ష నిర్వహించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.


పెళ్లిళ్లకు అనుమతి తప్పనిసరి : కలెక్టర్‌

మచిలీపట్నం టౌన్‌ : కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇకపై పెళ్లిళ్లకు  150 మందిని మాత్రమే అనుమతించాల న్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వైద్యశాఖ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించాలన్నారు. ఫంక్షన్‌ హాళ్లలో ఎక్కువ మందికి అనుమతి ఇవ్వరాదన్నారు. అలాగే సీజనల్‌ వ్యాధుల నివారణ, విలేజ్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌పై సమీక్ష చేశారు. 


Updated Date - 2021-08-27T06:09:36+05:30 IST