యువకుడి దాడి.. వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-10-07T06:35:45+05:30 IST

హోటల్‌లో అల్పాహారం తిని బిల్లు చెల్లించ కుండా పరారవుతున్న యువకుడ్ని పట్టుకోండి అంటూ ప్రజలు వెంటాడుతుంటే అడ్డుగా వెళ్లిన వృద్ధుడిపై నిందితుడు దాడి చేయండంతో మృతి చెందిన సంఘటన గుడివాడ లో జరిగింది.

యువకుడి దాడి.. వృద్ధుడి మృతి

గుడివాడ(రాజేంద్రనగర్‌) అక్టోబరు 6 :  హోటల్‌లో అల్పాహారం తిని బిల్లు చెల్లించ కుండా పరారవుతున్న యువకుడ్ని పట్టుకోండి అంటూ ప్రజలు వెంటాడుతుంటే  అడ్డుగా వెళ్లిన వృద్ధుడిపై నిందితుడు దాడి చేయండంతో మృతి చెందిన సంఘటన   గుడివాడ లో జరిగింది.  గుడివాడ టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం గుడివాడ పట్టణం లోని దోండపాడు కాలనీకు చెందిన గుడ్డేటి శ్రీహర్ష అనే యువకుడు కోతిబోమ్మ సెంటర్లో    హోటల్‌లో అల్పాహారం తిన్నాడు. బిల్లు చెల్లించకుండా పారిపోతుండగా అక్కడున్న కొందరు అతని వెంట పడ్డారు. ఈ క్రమంలో శ్రీహర్షను పట్టుకోండి అని వెంటపడుతున్నవారికి సాయం చేయాలన్న తలంపుతో బస్టాండ్‌ సెంటర్లో ఉన్న గంగాధరపురానికి చెందిన బండి కోటేశ్వరరావు(70) అనే వృధ్దుడు అతడికి అడ్డుపడాడు.  వెంటనే శ్రీహర్ష వృద్ధుడిపై  పిడి గుద్దులతో దాడి చేశాడు. కుప్పకూలిన వృద్ధుడికి రోడ్డు  దెబ్బ తగిలింది. అతడ్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోటేశ్వరరావు ఆసుపత్రిలో  మృతి చెందాడు. ఈ మేరకు సీఐ కె గోవిందరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-07T06:35:45+05:30 IST