అక్టోబరు 7 నుంచి దసరా ఉత్సవాలు
ABN , First Publish Date - 2021-09-09T06:04:34+05:30 IST
కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 7 నుంచి 15వ తేదీ వరకు కొవిడ్ నిబంధనల నడుమ దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు.
అక్టోబరు 7 నుంచి దసరా ఉత్సవాలు
దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్
భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు
దుర్గగుడి పాలకమండలి సమావేశంలో తీర్మానాలు
సుమారు రూ. 2 కోట్ల అంచనాలకు ఆమోదం
విజయవాడ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 7 నుంచి 15వ తేదీ వరకు కొవిడ్ నిబంధనల నడుమ దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఈ సారి దసరా ఉత్సవాలలో జగన్మాత దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి కుంకుమతోపాటు అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ను అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బుధవారం దేవస్థానంలోని మల్లికార్జున మహామండపం ఆరో అంతస్థులో నిర్వహించిన ట్రస్టు బోర్డు సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, షామియానాలు, సీసీ కెమెరాలు, మైక్‌సెట్, లైటింగ్ ఏర్పాటు, భక్తులకు తాగునీటి సరఫరా, ఘాట్లలో జల్లు స్నానాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఆలయానికి రంగులు తదితర పనులకు సంబంఽధించి సుమారు రూ. 2 కోట్లతో రూపొందించిన అంచనాలకు ఆలయ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇంకా దేవస్థానం పరిపాలన, స్టోర్స్, పూజలు తదితర విభాగాలు, కాంట్రాక్టులు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన మొత్తం 61 అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమో దించారు. ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశం అనంతరం ట్రస్టు బోర్డు ఛైర్మన్ పైలా సోమినాయుడు మీడియాతో మాట్లా డారు. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో దసరా ఉత్సవాలలో రోజుకు ఎంతమంది భక్తులను దర్శనానికి అనుమతించాలనే అంశంపై కలెక్టరు, నగర పోలీసు కమిషనరు, మున్సిపల్ కమిషనర్ తదితర ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించే కో-ఆర్డినేషన్ సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయిస్తారని చెప్పారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమ రాంబ, ఈఈ డి.వి.భాస్కర్, ఇతర విభాగాల అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. అక్టోబరు 7 నుంచి దసరా ఉత్సవాలు
ఫ దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్
ఫ భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు
ఫ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో తీర్మానాలు
ఫ సుమారు రూ. 2 కోట్ల అంచనాలకు ఆమోదం
విజయవాడ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 7 నుంచి 15వ తేదీ వరకు కొవిడ్ నిబంధనల నడుమ దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. ఈ సారి దసరా ఉత్సవాలలో జగన్మాత దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి కుంకుమతోపాటు అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ను అందజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బుధవారం దేవస్థానంలోని మల్లికార్జున మహామండపం ఆరో అంతస్థులో నిర్వహించిన ట్రస్టు బోర్డు సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, షామియానాలు, సీసీ కెమెరాలు, మైక్‌సెట్, లైటింగ్ ఏర్పాటు, భక్తులకు తాగునీటి సరఫరా, ఘాట్లలో జల్లు స్నానాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఆలయానికి రంగులు తదితర పనులకు సంబంఽధించి సుమారు రూ. 2 కోట్లతో రూపొందించిన అంచనాలకు ఆలయ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇంకా దేవస్థానం పరిపాలన, స్టోర్స్, పూజలు తదితర విభాగాలు, కాంట్రాక్టులు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన మొత్తం 61 అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమో దించారు. ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సమావేశం అనంతరం ట్రస్టు బోర్డు ఛైర్మన్ పైలా సోమినాయుడు మీడియాతో మాట్లా డారు. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో దసరా ఉత్సవాలలో రోజుకు ఎంతమంది భక్తులను దర్శనానికి అనుమతించాలనే అంశంపై కలెక్టరు, నగర పోలీసు కమిషనరు, మున్సిపల్ కమిషనర్ తదితర ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించే కో-ఆర్డినేషన్ సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయిస్తారని చెప్పారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమ రాంబ, ఈఈ డి.వి.భాస్కర్, ఇతర విభాగాల అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.