నూరుశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-19T06:07:15+05:30 IST

నూరుశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం

నూరుశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం
గొల్లగూడెంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో అనురాధ

పునాదిపాడు (కంకిపాడు), అక్టోబరు 18 : మండలంలో నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎంపీడీవో కొడాలి అను రాధ చెప్పారు. గొల్లగూడెంలో సోమవారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండలంలోని 20 గ్రామాల్లో నూరుశాతం వ్యాక్సి నేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సిబ్బందికి సూచించామని, పంచా యతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్లు  సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నత్తా దుర్గాభవాని, వ్యవ సాయ సలహా కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వరరావు, కార్యదర్శి వెంకటేశ్వరరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ మునిరాజు ఏఎన్‌ఎం మార్తమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T06:07:15+05:30 IST