నున్నలో ఆర్గానిక్‌ పంటల పరిశీలన

ABN , First Publish Date - 2021-11-09T06:27:27+05:30 IST

నున్నలో ఆర్గానిక్‌ పంటల పరిశీలన

నున్నలో ఆర్గానిక్‌ పంటల పరిశీలన
నున్నలో ఆర్గానిక్‌ పంటలను పరిశీలిస్తున్న విజయకుమారి

విజయవాడ రూరల్‌, నవంబరు 8 : నున్నలో 25 సెంట్ల విస్తీర్ణంలో ఆర్గానిక్‌ విధానంలో సాగవుతున్న పండ్ల తోటలను జీరో బేస్డ్‌ ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు డైరెక్టర్‌ డీఎంఎఫ్‌ విజయకుమారి సోమవారం పరిశీలించారు. నున్నకు చెందిన రైతు పోలారెడ్డి నాగిరెడ్డి తన 25 సెంట్ల విస్తీర్ణంలో మామిడి, నిమ్మ, సీతాఫలం, రామఫలం, లక్ష్మఫలం, దానిమ్మ, రేగిపండు, బత్తాయి తదితర పండ్ల మొక్కలను వేశారు. అందులో అంతర్‌ పంటగా బొప్పాయి, టమాటా, మిర్చి, అరటి మొక్కలను వేశారు. ఆ పంటలను పీడీ విజయకుమారి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మామిడిలో అంతర పంటలను సాగు చేస్తున్న గురుప్రసాద్‌, కూరగాయలు పండిస్తున్న శ్యామల, మామిడిలో ఆకుకూరలను పండిస్తున్న రమణారెడ్డి తోటలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-11-09T06:27:27+05:30 IST