ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-12-28T06:20:06+05:30 IST

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి
సీజేఐ ఎన్వీ రమణతో మాట్లాడుతున్న వడ్డెల్లి సాంబశివరావు

నందిగామ రూరల్‌, డిసెంబరు 27: తెలుగు జాతి కీర్తిని నలుదిశలా చాటిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలని అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు సోమవారం డిమాండ్‌ చేశారు. పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను కలిసి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేలా సిఫారసు చేయాలని కోరినట్లు తెలిపారు. 


Updated Date - 2021-12-28T06:20:06+05:30 IST