ఎన్‌ఎస్పీ కాల్వ ఆక్రమణలు.. పరిశీలించిన అధికారులు

ABN , First Publish Date - 2021-07-07T06:02:24+05:30 IST

కాకర్ల శివారు రామన్నపాలెం వద్ద కాకర్లమేజర్‌ ఎన్‌ఎస్పీ 22 ఎల్‌ వద్ద కాల్వ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు.

ఎన్‌ఎస్పీ కాల్వ ఆక్రమణలు.. పరిశీలించిన అధికారులు
రైతులతో కలిసి ఆక్రమణ ప్రాంతం పరిశీలిస్తున్న ఎన్‌ఎస్పీ అధికారులు

తిరువూరు :  కాకర్ల శివారు రామన్నపాలెం వద్ద కాకర్లమేజర్‌ ఎన్‌ఎస్పీ 22 ఎల్‌ వద్ద  కాల్వ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం రైతుల ఫిర్యాదుపై ఎన్‌ఎస్పీ డీఈ రాంబాబు, ఏఈ ప్రసన్నలక్ష్మి రైతులతో కలిసి పరిశీలించారు, ఏడు సంవత్సరాలుగా రామన్నాపాలెం సమీపంలో అమ్మప్రేమాశ్రమం నిర్వాహకులు  కాల్వ గట్టుపై గేట్లు, రేకుల షెడ్డు నిర్మించి తమ సాగుభూములకు దారిలేకుండా చేశారని రైతులు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన అధికారులు కాల్వ 3.90 కిలోమీటర్ల వరకు ఇరువైపుల అక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆశ్రమం నిర్వాహకులకు 15 రోజుల్లోగా గేట్లు, షెడ్డు తొలగించాలని ఆదేశించారు, కాల్వ పూడికతీత పనులు, ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడతామని డీఈ రైతులకు తెలిపారు.



Updated Date - 2021-07-07T06:02:24+05:30 IST