‘యువతకు ఉద్యోగాలు లేక కూరగాయలు అమ్ముకునే పరిస్థితి దాపురించింది’

ABN , First Publish Date - 2021-07-12T18:53:48+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో..

‘యువతకు ఉద్యోగాలు లేక కూరగాయలు అమ్ముకునే పరిస్థితి దాపురించింది’

జాబ్‌ క్యాలెండర్‌పై ఎమ్మెల్యే గద్దె వినూత్న నిరసన


మాచవరం: వైసీపీ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు లేక కూరగాయలు అమ్ముకునే పరిస్థితి దాపురించిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడ పార్లమెంట్‌ తెలుగు యువత ఆధ్వర్యంలో 6వ డివిజన్‌ మాచవరం బీఎ్‌సఎన్‌ఎల్‌ సమీపంలో జాబ్‌ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ, లక్షలాది మంది యువత ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. ఉపాధి చూపాల్సిన ప్రభుత్వం, సంక్షేమ పథకాల పేరుతో చేతులు దులుపుకుంటోందన్నారు. తక్షణం యువతకు కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్‌ తెలుగు యువత షేక్‌ నాగూర్‌ మాట్లాడుతూ, గత నెల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను నిరుత్సాహపరిచిందన్నారు. డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు పడాల గంగాధర్‌, కాశీ, పులిపాటి రాజు, పడాల వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-12T18:53:48+05:30 IST