నివేశన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-08-21T06:25:13+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు నిర్మాణాల కోసం కేటాయించిన నివేశన స్థ్థలాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి నిర్మాణాలు పూర్తి చేయాలని విజయవాడ సబ్‌కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ అధికారులను ఆదేశించారు.

నివేశన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టాలి

కొండపల్లి(ఇబ్రహీంపట్నం), ఆగస్టు 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు నిర్మాణాల కోసం కేటాయించిన నివేశన స్థ్థలాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి నిర్మాణాలు పూర్తి చేయాలని విజయవాడ సబ్‌కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ అధికారులను ఆదేశించారు. కొండపల్లిలో నివేశస్థలాలు, ఎన్టీటీపీఎస్‌ భూములు, నవేపోతవరంలో రెవెన్యూ, అటవీశాఖ భూములను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీటీపీఎస్‌ భూమికి సంబంధించిన అనుమతి కోసం దరఖాస్తు చేసిన భూమిని పరిశీలించారు. ఇటీవల వివాదస్పదంగా మారిన జి.కొండూరు మండలం నవేపోతవరంలో రెవెన్యూ, ఫారెస్టు భూములను సర్వే, అటవీశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. సబ్‌కలెక్టర్‌పాటు తహసీల్దార్‌ సూర్యారావు, ఫారెస్టు రెంజ్‌ ఆఫీసరు లెనిన్‌, సర్వేయర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T06:25:13+05:30 IST