దుర్గమ్మ సేవలో నిర్మలానందనాథ స్వామి
ABN , First Publish Date - 2021-01-12T06:05:24+05:30 IST
దుర్గమ్మ సేవలో నిర్మలానందనాథ స్వామి

విజయవాడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : కర్ణాటకలోని శ్రీఆది చుంచనగిరి మఠాధిపతి జగద్గురు నిర్మలానంద నాథ మహాస్వామి సోమవారం ఉదయం దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, వేదపండితులు, పాలకమండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఈవో ఎంవీ సురేష్‌బాబు అమ్మవారి ప్రసాదాలు, పండ్లు సమర్పించగా, స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గోదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చానని, అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కరోనా నుంచి ప్రజలందరికీ రక్షణ కల్పించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.