చెత్త, ఆస్తి పన్నుపై రగడ

ABN , First Publish Date - 2021-12-19T06:12:41+05:30 IST

చెత్త, ఆస్తి పన్నుపై రగడ

చెత్త, ఆస్తి పన్నుపై రగడ
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బాబూరావును ఈడ్చుకెళ్తున్న పోలీసులు

పట్టణ పౌరసమాఖ్య ఆధ్వర్యంలో వీఎంసీ ముట్టడి

అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత.. అరెస్టు

వన్‌టౌన్‌, డిసెంబరు 18 : చెత్తపన్ను విధింపు.. ఆస్తిపన్ను పెంపునకు నిరసనగా పట్టణ పౌరసమాఖ్య, సీపీఎం ఆధ్వర్యంలో శనివారం కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. చెత్త, ఆస్తి పన్నులు ప్రజలకు పెనుభారంగా మారాయని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మండిపడ్డారు. కౌన్సిల్‌ హాల్లో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరుగుతుండగా, నాయకులు, కార్యకర్తలు వీఎంసీ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం నేత సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సూచనల మేరకు ఆస్తిపన్ను పెంపు, చెత్తపన్ను వసూలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దోనేపూడి కాశీనాధ్‌, భూపతి రమణారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-19T06:12:41+05:30 IST