శ్రీజ్యోతి పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సు

ABN , First Publish Date - 2021-08-27T05:52:51+05:30 IST

శ్రీజ్యోతి పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సు

శ్రీజ్యోతి పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సు

కలవపాముల(ఉయ్యూరు), ఆగస్టు 26: కలవపాములలోని శ్రీజ్యోతి పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌(ఏఐ అండ్‌ ఎంఎల్‌) కోర్సు ప్రారంభిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ పర్వతనేని వంశీకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈకోర్సులో 60 సీట్లతో తరగతులు నిర్వహించేందుకు ఏఐసీటీఈ న్యూఢిల్లీ, ఎస్‌బీటీఈటీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి అనుమతులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సుకు బిజినెస్‌, కార్పొరేట్‌, టెక్నాలజీ రంగాల్లో మంచి డిమాండ్‌ ఉందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కోర్సు అందుబాటులోకి తేవాలని, చదువుకున్న వారికి మంచి భవిష్యత్‌ ఉండాలని కళాశాలలో ఈ కోర్సును ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-27T05:52:51+05:30 IST