హైవే విస్తరణ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-03-22T05:57:23+05:30 IST

హైవే విస్తరణ పనుల పరిశీలన

హైవే విస్తరణ పనుల పరిశీలన
హైవే విస్తరణ పనుల పరిశీలనలో మహావీర్‌ సింగ్‌ బృందం

 హనుమాన్‌జంక్షన్‌, మార్చి 21 :  నేషనల్‌  హైవే విస్తరణలో  భాగమైన హనుమాన్‌జంక్షన్‌  బైపాస్‌ పనులను  ఆదివారం  నేషనల్‌ హైవే ప్రాజెక్టు సభ్యులు  మహావీర్‌ సింగ్‌ పరిశీలించారు. ప్యాకేజీ -2లో  చిన్నఅవుటపల్లి - కలపర్రు వరకు జరుగుతున్న  నేష నల్‌  హైవే విస్తరణ పనులను  మహావీర్‌ సింగ్‌  బృందం  పరిశీలిం చింది. పనులు వేగవంతంగా సాగాలని  కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా డెవలప్‌ర్స్‌  ఇండియా లిమిటెడ్‌  సంస్థ  ప్రతినిధులను ఆదేశించారు.  చిన్నఅవుటపల్లి నుంచి  కలపర్రు వరకు రోడ్డు పనులను పరిశీలిం చారు. హనుమాన్‌జంక్షన్‌ బైపాస్‌లో భూసేకరణ సమస్యతో ఆలస్యం గా ప్రారంభించిన పెండింగ్‌ పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  నేషనల్‌ హైవే రీజనల్‌ ఆఫీసర్‌ ఆర్కేసింగ్‌, విజయవాడ పీడీ  డీవీ నారాయణ, టెక్నికల్‌ మేనేజర్‌ అమృతలాల్‌ సాహు, ఎల్‌డీపీఎల్‌  సంస్థ ఎండీ  వేముపల్లి  రవికిరణ్‌,  పీఎం  రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:57:23+05:30 IST