వినియోగదారుల హక్కుల పరిరక్షణకు చట్టాలు

ABN , First Publish Date - 2021-12-25T05:57:57+05:30 IST

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి రాజారాం అన్నారు.

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు చట్టాలు

సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్‌ 

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 24 : వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఉన్న చట్టాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి రాజారాం అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మహతి కళావేదికపై వినియోగ భారతి, మచిలీపట్నం కన్సూమర్‌ క్లబ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాజారామ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వినియోగదారులు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు చట్టపరంగా తీసుకోవలసిన చర్యలపై న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కలిగిస్తుందన్నారు. న్యాయవాదులు సర్వా లలిత కుమారి, జి ప్రభాకర్‌, న్యాయవాదుల గుమాస్తాల సంఘం నేతలు పివిఫణి కుమార్‌ , కె చంద్రశేఖర్‌, వాడపల్లి బాలాజీ పాల్గొన్నారు.

హక్కులను పరిరక్షించాలి : డీఎస్‌వో

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అందరూ ముందుకు రావాలని డీఎ్‌సవో కె.వి.ఎ్‌స.ఎం. ప్రసాద్‌ అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కృష్ణాజిల్లా పౌర సరఫరాల శాఖ కన్స్యూమర్స్‌ వాయిస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మచిలీపట్నం సంయుక్తంగా శుక్రవారం కలెక్టరేట్‌ స్పందన హాలులో నిర్వహించిన కార్యక్రమానికి ప్రసాద్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ ఏడాది వినియోగదారుడా! నీ హక్కులు తెలుసుకో! అనే అంశంపై జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. డీవైఈవో యు.వి. సుబ్బారావు, డివిజనల్‌ సప్లయి ఆఫీసర్‌ కోమలి పద్మ, సివికాం కార్యదర్శి పర్వతనేని మోహనరావు, తూనికలు కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వి.ఎస్‌. ఈశ్వరరావు, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎస్‌. పూర్ణచంద్రరావు, జిల్లా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రతినిధి మద్దూరి ప్రసాద్‌ మాట్లాడారు. అనంతరం విద్యార్ధులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - 2021-12-25T05:57:57+05:30 IST